Wednesday, October 22, 2025

Classroom Observation

7th Class Hindi Observation 

విజయోస్తు2 కార్యక్రమం పై Complex Headmasters and quilashapur Staff సమావేశం

విజయోస్తు-2 ప్రోగ్రామ్ గురించి వివరిస్తున్న ZPHS quilashapur పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ. భారత రవీందర్ గారు 

జిల్లా విద్యాశాఖ - జనగాం

“విజయోస్తు 2.0"

మన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధన ప్రధాన లక్ష్యంగా మరియు పదవ తరగతి విద్యార్థులందరూ SSC-2026 లో ఉత్తీర్ణతతో పాటు ఉన్నత ఫలితాల పొందాలనే సంకల్పంతో మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ షేఖ్ రిజ్వాన్ బాషా గారు 17/10/2025 వ తేదిన అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో "విజయోస్తు 2.0 యాక్షన్ ప్లాన్" సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో SSC-2026, దిక్సూచి, FLN/LIP మరియు వివిధ అకడమిక్ & నాన్ అకడమిక్ అంశాలపై మరియు పాఠశాలల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై మన జిల్లా పాలనాధికారి శ్రీ షేక్ రిజ్వాన్ fara గారు, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీ పింకేష్ కుమార్ గారు మార్గ నిర్దేశం చేశారు. అందుకనుగుణంగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాద్యాయులు కృషి చేయాలని, అనుసరించాల్సిన వ్యూహాల పైన దృష్టి పెట్టి విద్యార్థుల సంపూర్ణ అభ్యసన అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా కోరారు.

SSC - 2026 పరీక్షల్లో 100% ఫలితాల కోసం విజయోస్తు 2.0 యాక్షన్ ప్లాన్:

నవంబర్ 1 తేది నుండి ప్రతి పాఠశాలలో విద్యార్థుల స సందేహాల నివృత్తి కోసం ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం పాఠశాల వేళలకు అదనంగా ప్రత్యేక తరగతులను నిర్వహించి, SSC కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి.

సమ్మేటివ్ అసెస్మెమెంట్-1పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అనుశీలనం చేసి బాగా చదివే (80% మార్కుల పైన సాధించే), మధ్యస్తంగా చదివి(50% - 80%) మరియు అంతకంటే తక్కువగా సామర్థ్యాలు ఉన్న విద్యార్థులను గురించి ప్రత్యేక ప్రణాళికతో వారిని వార్షిక పరీక్షలకు సన్నద్ధులను లను చేయాలి.

తర్వాత బహుళ స్థాయి విద్యార్థులతో జట్టు లను ఏర్పరిచి, అన్ని గ్రూపుల విద్యార్థులు ఆ జట్టు లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ జట్టుకు ఒక తెలివైన విద్యార్థిని టీం లీడర్గా నియమించి ప్రతి జట్టును ఒక ఉపాధ్యాయుడు దత్తత తీసుకొని పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు వారి విద్య ప్రమాణాలు పెంచే విధంగా పర్యవేక్షణ చేయాలి. అలా పాఠశాలలో పని చేస్తున్న అందరు ఉపాద్యాయులు విద్యార్థి బృందాలను దత్తత తీసుకొని వారు SSC లో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి. దీనిని ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలి.

ప్రతి ఉపాధ్యాయుడు SSC పరీక్షలలో విద్యార్థులు మంచి స్కోర్ సాధించడానికి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ప్రతి రోజు ఉదయం తన జట్టు లో ఉన్న అందరు విద్యార్ధులకు ఉపాధ్యాయుడు వేకప్ ఫోన్ కాల్ చేసి వారు మేల్కొని చదివేటట్లు చేయాలి. అలాగే గుడ్ నైట్ కాల్ కూడ చేసి ఆ రోజు ఆ రోజు విద్యార్థులు చదివింది సమీక్షించాలి. తాము దత్తత తీసుకున్న జట్టులోని విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులందరు కృషి చేయాలి. జట్టు ను దత్తత తీసుకున్న ఉపాధ్యాయుడు తన సబ్జెక్టులోనే కాకుండా, మిగతా సబ్జెక్టులలో విద్యార్థులు ఎక్కడ వెనుకబడి ఉన్నారో గుర్తించి వాటిని అధిగమించే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దత్తత తీసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుడు నిరంతరం సంభంధాలు నేరుపుతూ వారి పిల్లలకు ఇంటి వద్ద చదువుకోవడానికి అనువైన పరిస్థితులు కల్పించాల్సిందిగా, వారు అనారోగ్యానికి గురి కాకుండా సరియైన పౌష్టికాహారం అందించాల్సిందిగా ఎప్పటికప్పుడు సూచించాలి. PTM ల్లో ఈ అంశాలను ప్రధాన మైనవి గా చేర్చి ప్రధానోపాధ్యాయులు పేరెంట్స్ దృష్టి కి తీసుకొని వెళ్ళాలి.

అకాడమిక్ క్యాలెండర్ 2025- 26 ప్రకారం జనవరి 10వ తేదీలోగా 10వ తరగతి మొత్తం సిలబస్ ను పూర్తి చేయాలి. ఒకవేళ సిలబస్ లో వెనుకబడి ఉంటే ప్రత్యేక తరగతులు నిర్వహించాలి.

ప్రతి రోజు నిర్వహించే ప్రత్యేక తరగతులలో ప్రభుత్వం అందించిన అభ్యాస దీపికలలోని అంశాలను సాధన చేయించాలి. అభ్యాస దీపికల దీపికల ప్రశ్నల ఆధారంగా ప్రతి శనివారం వీక్లీ స్లిప్ టెస్ట్ నిర్వహించాలి.

గత సంవత్సరాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల సమాధానాలను వచ్చే ఐదు నెలల్లో నెలకు ఒకటి చొప్పున విద్యార్థులు అవగాహన చేసుకునే టట్లు సంపూర్ణంగా వివరించాలి.

విద్యార్థుల చేతి వ్రాత అందంగా ఉండేలా, కొట్టివేతలు లేకుండా జవాబు రాసేలా ప్రతి విద్యార్థినీ తీర్చిదిద్దాలి. స్లిప్ టెస్ట్ ద్వారా వారు రాసిన జవాబు పత్రాలను సమీక్ష జరిపి వారు లోపాలను అధిగమించే విధంగా రంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలి.

విద్యార్థుల హాజరుతో పాటు ఉపాధ్యాయుల హాజరు కూడా చాలా ముఖ్యం కాబట్టి వారి సెలవుల మంజూరి అనేది విద్యార్థుల అభ్యసనానికి ఇబ్బంది లేకుండా ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ పెట్టాలి.

గత సంవత్సరం SSC ఫలితాల్లో తెలుగులో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదు. కావున విద్యార్థులు తెలుగు సబ్జెక్టు మీద ప్రత్యేక శ్రద్ద పెట్టడానికి ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలి.

గత సంవత్సరం SSC-2025 ఫలితాల్లో వెనుకబడిన మండలాలపై మరియు చాలా తక్కువ ఫలితాలను సాధించిన పాఠశాలలపై జిల్లా అధికారులు, ఎంఇఓ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. ప్రతి నెల నిర్వహించే సమీక్ష సమావేశం లో ఆ మండలాల ఎంఇఓ లు మరియు ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు SSC లో మంచి ఫలితాల సాధన కోసం వారు చేస్తున్న కృషి పై నివేదిక సమర్పించాలి.

గత సంవత్సరం మన జిల్లా NAS-2024లో మరియు SSC ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించింది. గౌరవ కలెక్టర్ గారు అందుకు కృషి చేసిన మనందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాలతో ఇక్కడికే సంతృప్తి చెందకుండా ఈసారి పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రం లో మన జిల్లా మొదటి స్థానంలో ఉండేటట్టు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని అందుకోసం మన విద్యార్థులను సిద్ధప ర్చాలని కోరారు.

“దిక్సూచి" కార్యక్రమం:

దిక్సూచి కార్యక్రమంలోని 8 అంశాలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలి. కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమ నిర్వహణ సంతృప్తి కరంగా నిర్వహించట్లేదని గౌరవ కలెక్టర్ గారి దృష్టికే వచ్చింది. ప్రతిరోజు అన్ని పాఠశాలలో 30 నిమిషాలు ప్రత్యేక దిక్సూచి పీరియడ్ ను నిర్వహించాలి.

రోజువారి నిర్దేశించిన దిక్సూచి అంశాలను ఆ రోజు విద్యార్థులకు వివరించాలి. అందుకోసం అందరు ఉపాధ్యాయులు భాగస్వాములై విద్యార్థులకు బోధించాలి. తగిన సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా క్రోడీకరించుకుని విద్యార్థుల స్థాయి కనుగుణంగా దిక్సూచి అంశాలను వివరించాలి. దిక్సూచి కి సంబంధించి సంపూర్ణ కంటెంట్ ను ఉపాధ్యాయులకు అందుబాటులోకి తీసుకొని రావడానికి జిల్లా స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రతి పాఠశాలలో హెల్త్ డిపార్ట్మెంట్ వారిచే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తారు. మెడికల్ ఆఫీసర్స్ పర్యవేక్షనలో ప్రతి విద్యార్థికి దిక్సూచి హెల్త్ కార్డు"ను అందజేస్తారు. ఆ హెల్త్ కార్డులో ఆ విద్యార్థి సంబంధించిన ధించిన ఆరోగ్య వివరాలు నమోదు చేస్తారు. హెల్త్ కార్డు ప్రకారం ప్రతి నెల విద్యార్థుల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వైద్యులు తగిన విధంగా సూచనలు ఇస్తారు. అన్ని పాఠశాలల్లో ఆరోగ్యమైన విద్యార్థులు ఉండాలని, అప్పుడే వారి అభ్యసన ఉన్నతంగా ఉంటుందని ఈ Diksuchi Health Card ల ప్రధాన లక్ష్యం.

ఇతర ముఖ్యమైన అంశాలు:

అన్ని పాఠశాలల్లో ఈ నెల ఆఖరి వరకు "స్ఫూర్తి పథం" కార్యక్రమ నిర్వహణ పూర్తి చేయాలి. మన విద్యార్థుల భవిష్యత్తు కలలు వారి కళ్ళ ముందే ప్రతి రోజు కనపడతూ వారి లో స్ఫూర్తిని నింపాలని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. దీన్ని విజయవంతం చేయడానికి ప్రతి ప్రధానపాధ్యాయుడు కృషి చేయడానికి బాధ్యత వహించాలి.

ప్రతి పాఠశాలలో స్కూల్ గ్రంధాలయంను ఏర్పాటు చేయాలి. పాఠశాలలో ఉన్న అన్ని పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. "పుస్తకాంజలి" కార్యక్రమంలో భాగంగా అవసరమైన గ్రంథాలయ పుస్తకాలను దాతల ద్వారా సమీకరించాలి. అందుకోసం పాఠశాల సిబ్బంది కృషి చేసి మన విద్యార్థుల జ్ఞాన వికాసానికి పాటు పడాలి.

పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) లో మన జిల్లా మెరుగైన స్థానం పొందడానికి మనమందరం కృషి చేయాలి. విద్యార్థుల అభ్యసన స్థాయి, ఉపాధ్యాయుల బోధన తీరు, పాఠశాల పరిపాలన, పాఠశాలలో ఉన్న మౌలిక వసతుల కల్పన వివరాలను U-DISE లో సంపూర్ణంగా అప్డేట్ చేయాలి.అందుకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాలి.

ప్రధానోపాధ్యాయులు PM-పోషణ్ online updation, విద్యార్థుల ఆధార్ అప్డేషన్, APAAR లో అందరు విద్యార్థుల నమోదు, FRS ద్వారా ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు నమోదు ను ప్రతిరోజు విధిగా 100% పూర్తి అయ్యేటట్లు పర్యవేక్షణ చేయాలి. కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు మరియు మండల విద్యాశాఖ అధికారులు తాము పాఠశాలలను సందర్శించినప్పుడు వీటిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి తగిన సూచనలను ఇవ్వాలి. ఆ సందర్శన వివరాలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో తప్పనిసరి నమోదు చేయాలి.

రెండవ జత యూనిఫాం అందరూ విద్యార్థులకు ఈ నెలలోనే అందజేయాలి. సరైన సంఖ్యలో యూనిఫాం అందుబాటులో లేకపోతే సంభందిత ఎంఇఓ దృష్టి కి ప్రధానోపాధ్యాయులు తీసుకువెళ్లాలి.MEO లు ఆ మండలంలో ఇతర పాఠశాలల్లో మిగిలిన యూనిఫాం ను అవసరమైన పాఠశాలకు అంద జేయాలి. అందుకోసం MPDO,APM, MEO లు సమావేశం అవ్వాలి. అలాగే హెడ్మాస్టర్లు ఎప్పటికప్పుడు యూనిఫాం డీటెయిల్స్ మరియు TEXT BOOKS డీటెయిల్స్ ను ఆన్లైన్ లో విధిగా అప్డేట్ చేయాలి.

MEO మరియు CHM లు ప్రతి నెలలో వారికి నిర్దేశించిన సంఖ్య ప్రకారం పాఠశాలను తప్పనిసరి సందర్శించి APP నమోదు చేయాలి.

ఈనెల 17వ తేదీ నుండి ప్రారంభమైన స్వచ్చపక్వాడ కార్యక్రమం లోని రోజు వారి కార్యక్రమాలను అన్ని పాఠశాలలో నిర్వహించాలి. పచ్చదనం, పరిశుభ్రత గురించి విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పిందాలి.

ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో వారి తరగతిస్థాయి అభ్యసన ఫలితాలు సాధించడానికి తరగతి గదిలో పిల్లల స్థాయికి అనుగుణంగా బోధించాలి. FLN లో బాగంగా అన్ని ప్రాథమిక పాఠశాలలో లెసన్ ప్లాన్, వర్క్ బుక్, TLM లు ఉపయోగించి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చాలి. ప్రతి నెల 18 లేదా 19వ తేదీల్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడుతుంది.

అంతకుముందే ప్రతి మండలంలో మండల విద్యాశాఖ అధికారులు మండల స్థాయిలో మండల స్థాయి

సమీక్ష సమావేశం నిర్వహించాలి. ప్రతి రోజు ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల హాజరు సంతృప్తికరంగా ఉండాలి. ఈ హాజరు అతి తక్కువగా ఉన్న ఐదు మండలాల మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిపై రెగ్యులర్గా సమీక్షించి వాటి వివరాలను జిల్లా కార్యాలయానికి అందించాలి.

"ఖాన్ ఆకాడమీ" మరియు "ఫిజిక్స్ వాలా" సంబంధించి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ కంటెంట్ ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. వాటికి సంబంధించి డిజిటల్ కంటెంట్ను సంపూర్ణంగా విద్యార్థులు ఉపయోగించుకునేటట్లు ఉపాధ్యాయులు కృషి చేయాలి.

"ఖాన్ అకాడమీ" కి సంబంధించి ప్రతి పాఠశాలలో అందరి విద్యార్థుల రిజిస్టేషన్ పూర్తి చేయాలి. ఈ గురువారం లోగా అన్ని పాఠశాలల్లో అందరు విద్యార్థుల రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్స్ పూర్తిచేయాలి. ఎప్పటికప్పుడు మండల విద్యాశాఖ అధికారులు డాష్ బోర్డు ద్వారా సమీక్షించాలి."

6 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు డీజిటల్ లెర్నింగ్ బుక్స్ అన్ని పాఠశాలలకు సరఫరా చేయడం జరిగింది, ఉపాధ్యాయులు శిక్షణ కూడా పొందారు. ప్రతి రోజు డిజిటల్ లెర్నింగ్ కరికులం ప్రకారం తరగతులు నిర్వహించాలి.

FLN-AXL పాఠశాలల్లో ప్రతి విద్యార్థి AI బోధనాభ్యాసనలో యాక్టివ్ గా ఉండేటట్టు ఉపాధ్యాయుల కృషి చేయాలి. దీనిపై క్లస్టర్ హెడ్మాస్టర్స్, MEO లు పర్యవేక్షణ చేయాలి. ఈ పాఠశాలల పనితీరును ఎంఈవోలు డాష్ బోర్డులో సమీక్షించి వాటి వివరాలు తెలుసుకొని ఇంకా మెరుగు అయ్యేట్లు బాధ్యత వహించాలి.

ఈ డిసెంబర్లో FLN & LIP Midline Test జరగబోతుంది. అందులో మన విద్యార్థులు మంచి ప్రతిభచూపించేటట్లు ఉపాధ్యాయుల కృషి చేయాలి. Base line టెస్టుల్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు మిడ్లైన్ టెస్ట్ లో మంచి ప్రతిభ చూపేటట్లు ఉపాధ్యాయులు కృషి చేయాలి.

స్త్రీ ప్రైమరీ క్లాసెస్ నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలో రెగ్యులర్గా కాంప్లెక్స్ హెడ్మాస్టర్ మరియు ఎంఈవోలు పర్యవేక్షణ చేయాలి. విద్యార్థుల నమోదు పెంచడానికి కృషి చేయాలి. నూతనంగా సరఫరా చేయబోతున్న ఆట బొమ్మలను, ఫర్నిచర్ ను జాగ్రత్త వాడుకోవడానికి వాటిని ప్రీ ప్రైమరీ విద్యార్థులు సురక్షితంగా ఉపయోగించుకునేట్లు headmasters పర్యవేక్షణ చేయాలి.

అన్ని పాఠశాలల్లో రెండవ పీరియడ్ తర్వాతనే గేమ్స్ పీరియడ్ ను నిర్వహించాలి. కొని పాఠశాలల్లో వివిధ కారణాలతో మొదటి పీరియడ్ నుండి ఆటల పీరియడ్ ను నిర్వహిస్తున్నారు. అలా చేయకూడదు.

ఈ నెల లో అన్ని పాఠశాలలో "కబడ్డీ" ఆటను ప్రధాన ఆటగా విద్యార్థులకు ప్రతే ప్రత్యేక తర్పీదు ఇవ్వాలి. జిల్లాలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అందుకోసం కృషి చేయాలి. కబడ్డీ ఆటలో మన విద్యార్థులు మంచి ప్రతిభ చూపేటట్లు కృషి చేయాలి.

ఈ నెల 22వ తేదీన అన్ని పాఠశాలల్లో స్టాఫ్ మీటింగ్ నిర్వహించి ఈ విషయాలు అందరు ఉపాధ్యాయులకు తెలియజేయాలి.

గౌరవ కలెక్టర్ గారి మరియు అదనపు కలెక్టర్ గారి నిర్దేశ్యాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంఈఓ లు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేసినప్పుడు మనం ఆశించిన ఫలితాలు తప్పనిసరి సాధిస్తాం.



Saturday, May 3, 2025

SSC 2024-25 Results


ZILLA PARISHAD HIGH SCHOOL, QUILASHAPUR

SSC RESULTS REPORT – MARCH 2025

Overview

Total Students Appeared: 31 (23 Boys + 8 Girls)
Total Passed: 29 (21 Boys + 8 Girls)
Total Failed: 2 (Boys)
Overall Pass Percentage: 93.5%
Girls Pass Percentage: 100%
Boys Pass Percentage: 91.3%

Top Mandal Rankers (Raghunathpally Mandal)

1. Shaga Kiranmai – 547/600 – Mandal 1st Rank
2. Aruru Manasa – 529/600 – Mandal 2nd Rank

School Toppers

1. Shaga Kiranmai – 547/600 – 1st Rank


2. Aruru Manasa – 529/600 – 2nd Rank


3. Thaduri Swapnika – 522/600 – 3rd Rank


4. Banothu Rakesh – 491/600 – 4th Rank

Marks Band — Number of Students

551–600:         Nil

501–550:    2 students

451–500:     6 students

401–450:     7 students

351–400:     7 students

301–350:     7 students

Below 300:   2 students (Failed)


Subject-Wise Toppers (Top 3 Positions)


Subject 1st Name 1st Marks 2nd Name 2nd Marks 3rd Name 3rd Marks
TEL SHAGA KIRANMAI 88 THADURI SWAPNIKA 88 BANOTHU RAKESH 82
English SHAGA KIRANMAI 91 THADURI SWAPNIKA 91 ARURI MANASA 90
Maths ARURI MANASA 96 THADURI SWAPNIKA 92 SHAGA KIRANMAI 89
Science ARURI MANASA 96 SHAGA KIRANMAI 95 MUDU VEERANNA 94
Social SHAGA KIRANMAI 94 THADURI SWAPNIKA 90 NAKASHI SWAPNIKA 85
Hindi SHAGA KIRANMAI 90 ARURI MANASA 90 THADURI SWAPNIKA 82


Appreciation and Acknowledgements

Headmaster Dr. Bharatha Ravinder congratulated all students and teachers for their dedicated efforts and consistent hard work. Special appreciation was extended to the teaching staff who conducted remedial classes, special tests, and personal mentoring sessions.

The support of parents throughout the academic year has been commendable. Their cooperation helped ensure discipline, punctuality, and moral support for the students.

This year’s SSC achievements received wide appreciation, including local newspaper coverage for the success of top scorers Shaga Kiranmai and Aruru Manasa, who secured 1st and 2nd Mandal ranks respectively.


- Headmaster


Tuesday, March 4, 2025

National Science Day Celebration at ZPHS Quilashapur


National Science Day Celebration at ZPHS Quilashapur



                   National Science Day was celebrated at ZPHS Quilashapur on March 1, 2025. Although the event is traditionally observed on February 28—the day when Sir C.V. Raman discovered the Raman Effect—it was postponed to March 1 due to unavoidable circumstances.

Students from classes 6 to 10 actively participated in the Science Day celebrations. The event began with an essay writing competition on the topic "The Role of Science in India's Development." Many students showcased their understanding of how science has contributed to various sectors like agriculture, medicine, space research, and technology in India.

Following the essay competition, a Science Fair was organized, where students from classes 6 to 10 exhibited their innovative projects and models related to Biological Science, Physics, and Chemistry. The Science Fair was inaugurated by the Headmaster, Dr. B. Ravindar, in the presence of the school's science teachers, including:

  • Venkateshwarlu Sir (Biological Science)
  • M. Srinivas Reddy Sir (Physical Science)
  • Panchakshari Sir (Biological Science)
  • Prasanna Rani Madam (Physical Science)

With the guidance of their respective science teachers, students prepared and presented various exhibits, demonstrating scientific concepts and innovations. All students of the school visited the exhibits, interacting with the presenters and learning new scientific ideas. The enthusiasm of the participants and the curiosity of the visitors made the event highly engaging.

The Headmaster, Dr. B. Ravindar, appreciated the efforts of all science teachers and students for making the Science Fair a grand success. He encouraged students to develop a scientific temperament and apply their knowledge in real-life situations.

The event concluded with a vote of thanks, leaving students inspired and motivated to explore the wonders of science further.


Search This Blog