Friday, February 21, 2025

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం @ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖిలాషాపూర్





          ఫిబ్రవరి 21 నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖిలాషాపూర్ లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పాఠశాల ఇన్చార్జి  ప్రధానోపాధ్యాయులు శ్రీ . ఆడెపు శ్రీనివాస్ గారి నేతృత్వంలో, తెలుగు సహ ఉపాధ్యాయులు శ్రీ. Ch. రమేశ్ గారు మరియు శ్రీ కద్దూరి శ్రీకాంత్ గారల ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. 
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారి వారి ప్రసంగాలలో మాతృభాషను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను, దానివల్ల కలిగే లాభాలను చక్కగా వివరించారు. 
ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు మాతృభాషలో  తమ తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. పద్యాలు, పాటలతో వీనులవిందు చేశారు. మాతృభాష గొప్పతనాన్ని తమ ప్రసంగాలతో వివరించారు. తేట తెలుగు పాటలకు నృత్యాలు  చేసి విద్యార్థినీ విద్యార్థులను ఉర్రూతలూగించారు జుం జుం తారారే ... జుం జుమ్ తారారే అంటూ రమేష్ సర్ పాడిన పాట,  'తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటూ ...' తెలుగు ఉపాధ్యాయుడు ప్రవీణ్ సార్ పాడిన పాట, కళావతి మేడం పాడిన చెట్టు పాట అందరినీ ఆకట్టుకున్నాయి. గణిత ఉపాధ్యాయుడు సరాబు శ్రీనివాస్ సర్ తన పెళ్ళిరోజు సందర్భంగా పిల్లలకు  మిఠాయిలు పంచారు. 
చివరకు ప్రవీణ్ సార్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. 












7TH CLASS CHILDREN PERFORMING DANCE 





9th Class Children Performing Dance 





9th Class Children Performing  Dance 


No comments:

Post a Comment

Search This Blog